కొత్త నోట్లను వదిలిపెట్టని పవన్ కళ్యాణ్!
Published on Nov 24, 2016 7:16 pm IST

pwawn
భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా డబ్బు కొరత బాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక పెద్ద నోట్లు రద్దయ్యాక ఆ స్థానంలో వచ్చిన కొత్త 2000, 500 రూపాయల నోట్లు ఇప్పటికే చలామణీలోకి వచ్చాయి. ఇక ఈ నోట్ల రద్దును ఈ విధంగా అనూహ్యంగా ప్రకటించాల్సింది కాదని మొదట్నుంచీ చెబుతూ వస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాజాగా కొత్త నోట్లను నిశితంగా పరిశీలిస్తూ కనిపించారు. ‘కాటమరాయుడు’కు సంబంధించిన షూట్ జరుగుతోన్న ప్రదేశంలో ఈ సన్నివేశం కనిపించింది.

షూట్ గ్యాప్‌లో కొత్త 2000 రూపాయల నోటును, 100 రూపాయల నోటుతో కలిపి పోల్చుకుంటూ పవన్ పరిశీలిస్తున్నారు. ఇక షూట్ లొకేషన్లోనే టీమ్ ఈ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో విడుదల చేసింది. 2000 రూపాయల నోట్లను విడుదల చేయడం ద్వారా ఉపయోగం లేదని, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతుందని ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్, ఇప్పుడిలా ఆ నోట్లను పాత నోట్లతో పోల్చుతూ ఉండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు.

 
Like us on Facebook