రీ రిలీజ్ కి రెడీ అవుతోన్న పవర్ స్టార్ సూపర్ హిట్ మూవీ ?

రీ రిలీజ్ కి రెడీ అవుతోన్న పవర్ స్టార్ సూపర్ హిట్ మూవీ ?

Published on Dec 5, 2022 9:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బద్రి మూవీ సరిగ్గా 22 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ అందుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మూవీతోనే మెగాఫోన్ పట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల మ్యూజిక్ అందించిన ఈ మూవీలో అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్స్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించారు.

ఇక ఈ మూవీలో బద్రి గా పవర్ స్టార్ పెర్ఫార్మన్స్ తో పాటు సాంగ్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్ని కూడా అప్పటి ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ సక్సెస్ఫుల్ మూవీని డిసెంబర్ 30న గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మూవీకి మధు అంబట్ ఫోటోగ్రఫి అందించారు. కాగా ఈ మూవీ యొక్క రీ రిలీజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు