తన డైరెక్టర్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్

తన డైరెక్టర్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్

Published on Dec 23, 2022 12:59 AM IST

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ కానుంది.

ఇక ఇటీవల సినీ కెరీర్ పరంగా దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆపైన వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ అనంతరం మంచి అందుకుంది వకీల్ సాబ్. అయితే విషయం ఏమిటంటే, తాజగా ఆ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్, అన్న లెజెనోవా దంపతులిద్దరూ ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ బహుమతులను పంపించారు. తమ అభిమాన హీరో నుండి వచ్చిన ఆ బహుమతుల పిక్స్ ని వేణు శ్రీరామ్ సతీమణి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ పవన్, అన్నా లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు