టాక్..తన ఈ భారీ సినిమా విషయంలో పవన్ ప్రత్యేక శ్రద్ధ..?

Published on Jan 9, 2022 5:15 pm IST


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు షూట్ ప్రోగ్రెస్ లో ఉన్నవాటితో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిది దర్శకుడు సాగర్ చంద్ర తో చేస్తున్న మాస్ సినిమా “భీమ్లా నాయక్” కాగా మరొకటి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ సినిమా “హరిహర వీరమల్లు”. మరి వీటి తర్వాత కూడా పవన్ పలు సాలిడ్ సినిమాలు చేస్తున్నారు.

అయితే మరి ఈ టోటల్ లైనప్ లో పవన్ మాత్రం పర్టిక్యులర్ గా ఓ సినిమా పట్ల ప్రత్యేకంగా పర్సనల్ గా ఆసక్తి చూపిస్తున్నారని బజ్ వినిపిస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ తన ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియా సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమా విషయంలోనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారట. దీని కోసం పవన్ తనలోని ప్రతి ఎలిమెంట్ ని వినియోగిస్తున్నారట.

అంతే కాకుండా దర్శకుడు క్రిష్ తో కూడా అనేక అంశాలు ఈ సినిమాకి ఉపయోగపడే వాటిపై చర్చిస్తూ సినిమాకి తన వల్ల అయ్యే బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ ఆల్రెడీ ఈ సినిమా ఏ స్థాయిలో ఉండనుందో కొన్ని శాంపిల్స్ ఇది వరకే చూసాము. మరి ఓవరాల్ గా సినిమాని ఏ లెవెల్లో చూపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :