రూ.200 కోట్ల క్లబ్ పై కన్నేసిన పవన్ కళ్యాణ్ !

17th, December 2017 - 12:01:54 PM

తెలుగు సినిమాలు స్టామినా పెరిగింది. మన స్టార్ హీరోలకు రూ100 కోట్ల క్లబ్ కొంత సులభంగానే మారిపోయింది. ట్రేడ్ వర్గాలు కూడా పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ.100 కోట్లను టచ్ చేస్తుండటంతో సినిమా విజయాన్ని, లాభాలని రూ.200 కోట్ల క్లబ్ తో అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో ఆ రూ.200 కోట్ల క్లబ్ ను అందుకోగల సత్తా ఉన్న చిత్రం పవన్ కళ్యాణ్ యొక్క ‘అజ్ఞాతవాసి’.

విడుదలకు ముందే రూ.100 కోట్ల పైచిలుకు వ్యాపారాన్ని చేసిన ఈ చిత్రం భారీస్థాయి ఓపెనింగ్స్, చిత్రం బాగుంటే వచ్చే వసూళ్లు అన్నింటినీ కలుపుకుని రూ. 200 కోట్ల మార్కుని చేరుకునే అవకాశాలున్నాయి. యూఎస్ లో ఇప్పటి వరకూ ఏ భారతీయ చిత్రం విడుదలకాని రీతిలో సుమారు 560 కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా దిగుతోంది. దీని ద్వారా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రానున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ ఏర్పడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల హోరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాబట్టి అన్నీ సజావుగా ఉండి నెలకొని ఉన్న హైప్ కు తగ్గట్టే చిత్రం గనుక అని వర్గాల ప్రేక్షకుల్ని అలరించగలిగితే రూ.200 కోట్ల క్లబ్ చేరుకునే మొదటి సినిమా ఇదే అవడం పెద్ద కష్టమేం కాదు.