లేటెస్ట్ : అన్నవరం నుంచి వారాహి బస్సు యాత్రను ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

Published on Jun 3, 2023 12:20 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలతో పాటు అటు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు చేస్తున్నారు. అలానే త్వరలో ఒక్కొక్కటిగా ఇవి సినీ ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మరోవైపు జనసేన తరపున పలు మీటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, జూన్ 14 నుండి వారాహి బస్సు యాత్రని ప్రారంభించనున్నట్లు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి.

ముందుగా ఈ వాహనానికి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తన పర్యటనను ప్రారంభించనున్నారు పవన్. తొలి విడత బస్సు యాత్రలో భాగంగా పవన్ తూర్పుగోదావరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత భీమవరం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, మామిడివరం, రాజోలు, పి గన్నవరం, నరసాపురం లలో పర్యటించనున్నారు. తన బస్సు యాత్రలో పవన్ స్థానిక ఓటర్లు మరియు తన పార్టీ కార్యకర్తలతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ భవితవ్యాన్ని మార్చేస్తుందని పవన్, జనసేన మద్దతుదారులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :