లేటెస్ట్..చిన్నారి చైత్ర కుటుంబాన్ని కలవనున్న పవన్!

Published on Sep 15, 2021 2:00 pm IST


తెలంగాణా లోని సైదాబాద్ ప్రాంతంలో ఆరేళ్ళ పసికందు చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కూడా ఎంతలా కలచివేసిందో తెలిసిందే. నిందితుడు పరారీలో ఉండగా సామాన్య ప్రజలతో పాటుగా సినీ తారలు కూడా ముక్తకంఠంతో గళమెత్తుతున్నారు. తాజాగా నాని, మహేష్ బాబు, మంచు మనోజ్ లు ఈ ఘటనపై స్పందించగా మరో ప్రముఖ హీరో మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు.

ఈరోజు చైత్ర తల్లిదండ్రులను నేరుగా వెళ్లి కలసి పరామర్శించనున్నట్టుగా ఇప్పుడు తెలిసింది. హైదరాబాద్ లో వారి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి చైత్ర కుటుంబాన్ని కలవనున్నారట. ఇంతకు మునుపే వారు పవన్ ని ఈ సమస్యపై స్పందించాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. అలాగే ఇది వరకే పవన్ ఏపీలో సుగాలి ప్రీతీ దారుణ ఘటనపై కూడా . మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరి ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :