
టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కోసం రాజకీయ వేత్తలు, ప్రెస్, జనసేన సపోర్టర్స్ ఎదురు చూస్తున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కి హాజరు కానున్నాడు. ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఓటు ఫర్ నోట్ అనే టాపిక్, ఫోన్ టాపింగ్ మరియు సెక్షన్ 8 విషయాలపై మాట్లాడటాడని అందరూ ఆశిస్తున్నారు.
గత వారమే పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతం ఇరు రాష్ట్రాల రాజకీయాలను ఇబ్బంది పెడుతున్న కాష్ ఫర్ ఓటు, ఫోన్ టాపింగ్ పై స్పందిస్తానని చెప్పాడు. ప్పతి నుంచి ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్లో ఎలాంటి కామెంట్స్ చేస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర రాజధాని విషయంలో ల్యాండ్ ఆక్రమణ విషయంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏయే విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు అనే దానికోసం మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే..