పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఓజీ’ సీక్వెల్‌పై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు సుజీత్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడం, కొన్ని నెలల పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
అంతేకాకుండా, రాబోయే కొన్ని నెలలు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండనుండటంతో ఈ ఏడాది ప్రణాళిక చేసిన అధికారిక ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వేసవి తర్వాత ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోగా దర్శకుడు సుజీత్, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే వేసవికి విడుదల చేసే యోచనలో ఉన్నారు.
అనంతరం వచ్చే ఏడాది ప్రారంభంలోనే ‘ఓజీ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరం కానున్నాయి. మరోవైపు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ పట్ల పవన్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో, ఆయన సూచనల మేరకు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ‘ఓజీ’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిన తర్వాతే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
