ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమా రీమేక్ చేయనున్న పవన్?

Published on Mar 20, 2022 9:41 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన చిత్రం “భీమ్లా నాయక్” కోసం తెలిసిందే. మళయాళంలో సూపర్ హిట్ అయ్యినటువంటి చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ మరియు రానా లతో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించి సాలిడ్ హిట్ కొట్టాడు. అయితే ఇదిలా ఉండగా పవన్ కెరీర్ లో లాస్ట్ లాస్ట్ “వకీల్ సాబ్” తో పాటు ఇది కూడా ఇంకో రీమేక్ సినిమాగా నిలిచింది.

అయితే పవన్ రీమేక్ చేసిన సినిమాల్లో పోలీస్ గా నటించిన రెండో చిత్రం “భీమ్లా నాయక్”. మొదట “గబ్బర్ సింగ్” తో భారీ హిట్ కొట్టిన పవన్ మళ్ళీ భీమ్లా తో మంచి విజయాన్ని నమోదు చేసాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కాలేదు కానీ ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయ్యిన సినిమా ఒకటి పవన్ రీమేక్ చేసారు. అదే “కాటమరాయుడు”.

సరే ఇది పక్కన పెడితే పవన్ మళ్ళీ మరో పోలీస్ సినిమా అందులోని ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యిన నోటెడ్ సినిమాని మళ్ళీ తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ సినిమానే తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన చిత్రం “తేరి”.

తెలుగులో “పోలీసోడు” అంటూ ఓ కాంట్రవర్సీ తో మంచి సెన్సేషన్ నే నమోదు చేసి తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాని మరో యంగ్ దర్శకుడితో పవన్ రీమేక్ చేస్తునట్టు నయా టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆ సినిమా అయితే తెలుగు బుల్లితెర దగ్గర ఎన్నో సార్లు ఆడియెన్స్ చూసేసారు. మళ్ళీ దాన్ని రీమేక్ అంటే చూడాలి ఏమవుతుందో అనేది.

సంబంధిత సమాచారం :