మాస్ మహారాజ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.?

Published on Mar 19, 2022 2:00 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాల్లో పవన్ నటించిన తాజా సినిమా “భీమ్లా నాయక్” అయితే పవన్ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా అనంతరం పవన్ లైనప్ కి సంబంధించి మరింత ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి.

మరి వీటి ప్రకారం ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని ప్రకారం పవన్ ఇపుడు మాస్ మహారాజ రవితేజ దర్శకుడు సుధీర్ వర్మతో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజతో “రావణాసుర” అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

దీనితో ఈ దర్శకుడు పవన్ తో సినిమా అనే సౌండింగ్ బాగానే ఉంది కానీ మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తెలియాల్సి ఉంది. ఇప్పటికే పవన్ మరిన్ని రీమేక్ సినిమాలు చేస్తున్నారని టాక్. మరి తాను కూడా ఏదన్నా రీమేక్ సినిమానే చేస్తున్నాడా లేక డైరెక్ట్ సినిమానా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :