అన్ స్టాపబుల్2: ఆకట్టుకుంటున్న పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 స్పెషల్ గ్లింప్స్

Published on Feb 9, 2023 5:00 pm IST

ప్రముఖ ఒటిటి మాధ్యమం ఆహాలో ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ 2 మంచి జోష్ తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోకి గెస్ట్ లు గా వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వారం గెస్ట్ గా విచ్చేయగా ఆయన పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు పార్టులు గా ప్రసారం చేస్తున్నారు ఆహా వారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రసారం అయిన మొదటి పార్టు కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించగా రెండవ పార్ట్ ని కూడా మరింత ఆసక్తికరంగా సిద్ధం చేసారు.

కాగా కొద్దిసేపటి క్రితం పార్టు 2 యొక్క స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు మూవీ చేస్తోన్న క్రిష్, పవన్ ని కొన్ని సరదా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాగా వాటికి పవన్ ఏ విధంగా సమాధానాలు ఇచ్చారు అనేది మనం పార్ట్ 2 లో చూడాల్సిందే. అలానే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సంబందించిన పలు అంశాలు కూడా పార్ట్ 2లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా పార్ట్ 2 ని ముందుగా ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందే అనగా ఫిబ్రవరి 9న ప్రసారం చేయనున్నారు ఆహా వారు. కాగా ఈ పార్ట్ 2 నేడు రాత్రి 9 గంటల నుండి ఆహా ఆడియన్స్ ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :