లేటెస్ట్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 5, 2023 7:41 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కలయికలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ అనంతరం చాలా గ్యాప్ తరువాత పవన్, హరీష్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీని పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని మే 11న విడుదల చేయన్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఒక వీడియో బైట్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేసారు. మే 11 కి గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయి సరిగ్గా 11 ఏళ్ళు కావడంతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు దేవి. ఇక తమ అభిమాన పవర్ స్టార్ మూవీ నుండి గ్లింప్స్ రానుండడంతో ఆయన ఫ్యాన్స్ అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :