15న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లీక్డ్ సాంగ్.. కల్ట్స్ సిద్ధమా?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నా కాంబినేషన్ లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ఉస్టాగ్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ సినిమా నుంచి ఇప్పుడు రెండో సాంగ్ ని విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ దేఖేలేంగే సాలా సూపర్ హిట్ అయ్యింది. దీనితో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆ రెండో పాట కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ustaad next from Feb 15: ఈ 15నే ఉస్తాద్ రెండో పాట

ఊహించని విధంగా లీక్ అయ్యిన ఈ సాంగ్ పై లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తాలూకా రెండో సాంగ్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 15కి లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ గ్యాప్ లోనే అనౌన్సమెంట్ ఇంకా ప్రోమో కట్ లు కూడా బయటకి వస్తాయని టాక్. సో పవర్ స్టార్ కల్ట్స్ ఆ రోజు వరకు ఆగాల్సిందే.

పక్కా మాస్ ఎలివేషన్ నెంబర్?

ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ ఆరాని దృష్టిలో పెట్టుకొని ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ తో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు ఎంతో కేర్ తీసుకొని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇది వచ్చాక మేనియా మళ్ళీ గబ్బర్ సింగ్ రోజులని తలపిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version