పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ ప్యాక్డ్ అప్ డేట్

Published on May 3, 2023 11:57 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న మాస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ తేరి కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న తమ మూవీ యొక్క పవర్ ప్యాక్డ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నాం అంటూ దర్శకుడు హరీష్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ ఆయనంక బోస్ లొకేషన్స్ సెర్చింగ్ లో భాగంగా దిగిన పిక్స్ ని పోస్ట్ చేసారు. మొత్తంగా అయితే అటు ఓజి, ఇటు ఉస్తాద్ రెండు సినిమాలకు సంబంధించి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నేడు అప్ డేట్స్ వచ్చాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :