పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

Published on Dec 30, 2022 12:06 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవల అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ నేడు ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీకి సంబంధించి చర్చిస్తున్న పిక్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని అద్భుతంగా సిద్ధం చేసారని, తప్పకుండా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అందరి అంచనాలు మించేలా ఉంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు