వైరల్ పిక్ : ‘వీరసింహారెడ్డి’ సెట్స్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్

Published on Dec 23, 2022 5:06 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డి మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క సెట్స్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నెల 27 న ఆహా ఓటిటి లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆరోజున ఆయన ఎపిసోడ్ చిత్రీకరణ జరుగనుంది.

సంబంధిత సమాచారం :