మన టాలీవుడ్ సినిమా దగ్గర అపారమైన క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు సాలిడ్ చిత్రాలు హీరోగా చేస్తుండటమే కాకుండా తన పొలిటికల్ వ్యవహారాల్లో కూడా బిజీగా ఉన్నారు. దీనితో ఈ రెండిటిలో కూడా పవన్ పేరు బాగా వైరల్ అవుతుండగా మొన్నటి వరకు “ఓజి” గా గట్టిగా వినిపించిన పవన్ పేరు ఇప్పుడు తన పొలిటికల్ పరంగా వైరల్ గా మారింది.
ఇక నిన్న రాత్రి సమయం నుంచి అయితే ఏపీలో జరిగిన పరిణామాలతో పవన్ తీసుకున్న డెసిషన్స్ కానీ తన అగ్రెసివ్ స్పందనతో తన పేరు మరింత స్థాయిలో వినిపించడం మొదలైంది. మెయిన్ గా తమిళ్ సినీ ఫ్యాన్స్ కూడా పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నిన్నటి విజువల్స్ వైరల్ చేస్తున్నారు. దీనితో ఎక్స్ ట్రెండింగ్ లో పవన్ పేరు నిలవగా ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలు వీడియోలు మరింత స్ప్రెడ్ చేస్తున్నారు.