మరొకసారి అభిమానులను హెచ్చరించిన పవన్ కళ్యాణ్

Published on Oct 31, 2021 11:12 pm IST

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. తను నటించిన సినిమాలతో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలం గా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విషయం పై పదే పదే చెప్తూ వస్తున్నారు. తనను పవర్ స్టార్ అని పిలవద్దు అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా మరొకసారి ఇదే విషయం పై అభిమానులను హెచ్చరించారు పవన్.

నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి అని వ్యాఖ్యానించారు. మీ మెడడులను పెంచుకోండి, నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నేడు ఒక సమావేశం లో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్, తనకు అధికారం వచ్చాక అలా పిలవండి అని గతంలో వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత సమాచారం :

More