మహేష్ విషయంలో అందరికన్నా ఆసక్తిగా మారిన పవన్ విషెష్..!

Published on Aug 10, 2022 7:57 am IST


నిన్ననే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 47 వ పుట్టినరోజును కంప్లీట్ చేసుకోగా ఈ స్పెషల్ డే కి గాను సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో ఆఫ్ లైన్ లో భారీ స్థాయి సెలబ్రేషన్స్ లో మహేష్ ఫ్యాన్స్ చేశారు. అయితే ఈ స్పెషల్ డే కి అనేకమంది విషెష్ తెలిపారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపిన విషెష్ మాత్రం చాలా స్పెషల్ గా మారాయి అని అభిమానులు అంటున్నారు. మరి అంతలా పవన్ విషెష్ ఎందుకు అలా స్పెషల్ గా మారాయి అంటే..

మొదట పవన్ నుంచి ప్రత్యేకంగా అధికారిక ప్రెస్ నోట్ ద్వారా విషెష్ వచ్చాయి. కానీ రెండో సారి మళ్ళీ మొత్తం మ్యాటర్ తో ట్విట్టర్ లో ఒక థ్రెడ్ గా వేయడం కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇలా పవన్ నుంచి ఎప్పుడు రెండు సార్లు ఇలా విషెష్ చెప్పడం జరగలేదని మొట్ట మొదటి సారి అందులోని సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనే జరిగింది అని ఇరు హీరోల ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ విషెష్ ఫ్యాన్స్ కి వెరీ స్పెషల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :