నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పవన్.!

Published on Mar 7, 2023 12:02 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలు ఓకే చేసిన చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల కిందటే రెండు సినిమాలు అనౌన్స్ చేసిన పవన్ ఇప్పుడు ఒకో సినిమాని వరుసగా అయితే జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ రీమేక్ సినిమాలో పవన్ నిర్విరామంగా నటిస్తుండగా ఇక ఈ సినిమా తర్వాత కూడా పవన్ నాన్ స్టాప్ గా వర్క్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

తన భారీ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ మినహా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజి సినిమాలు కి డేట్స్ ని పవన్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాలు కంప్లీట్ చెయ్యాలని పవన్ ఇప్పుడు ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే పవన్ ఈ రకంగా తన సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పాలి. వీటిలో అయితే వినోదయ సీతం రీమేక్ ఈ ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :