ఈ ప్రముఖ డైరెక్టర్ తో పవన్ కళ్యణ్ సినిమా..!

ఈ ప్రముఖ డైరెక్టర్ తో పవన్ కళ్యణ్ సినిమా..!

Published on Oct 24, 2022 1:34 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు సహా రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి పవన్ అయితే నటిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు” ఇప్పుడు సెట్స్ మీద ఉంది. ఇక ఈ చిత్రం షూటింగ్ అలా లేట్ అవుతూ వస్తుండగా పవన్ ఆల్రెడీ పలు మిగతా సినిమాలు కూడా కమిట్ అయ్యి ఉన్నారు. మరి ఈ చిత్రాలు ఎప్పుడు మొదలవుతాయి అనేది ఇంకా క్లారిటీ లేదు.

కానీ మరి ఇప్పుడు మరో దర్శకుడు పవన్ తో సినిమా చేస్తున్నట్టు చెబుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు లేటెస్ట్ గా మెగాస్టార్ తో “భోళా శంకర్” సినిమా చేస్తున్న దర్శకుడు మెహర్ రమేష్. తాను లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే ఈ విషయం వెల్లడించారు. మరి ఈ కాంబోలో అయితే ఎప్పుడు ఈ సినిమా ఉంటుందో చూడాలి. అలాగే పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ కూడా ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు