వైరల్ : మహేష్ ని కలిసాక మీడియాతో పవన్ మాటలు.!

వైరల్ : మహేష్ ని కలిసాక మీడియాతో పవన్ మాటలు.!

Published on Nov 15, 2022 2:00 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎన్నెన్నో వండర్స్ ను పరిచయం చేసినటువంటి స్టార్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు స్వర్గస్థులు అయ్యారు. దీనితో తెలుగు సినిమా దగ్గర ఒక మహా శకం ముగియగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉన్న ఎందరో ఇతర తారలు మహేష్ బాబు గృహానికి చేరుకొని కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి వారి ఆహ్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.

మరి వారిలో ప్రముఖ హీరో మరియు రాజకీయ నాయకులూ అలాగే మహేష్ కి సన్నిధులు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మహేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించడంకి సంబంధించి పలు విజువల్స్ వైరల్ గా మారాయి. మరి వారిని కలిసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ తో ఎప్పుడూ తాము ఉంటామని ఈ వార్త విని చాలా బాధపడ్డానని పవన్ తెలిపారు.

అలాగే చాలా తక్కువ సమయంలోనే మహేష్ గారికి మూడు విషాద ఘటనలు ఎదురు కావడం నిజంగా నన్ను చాలా బాధ కలిగించింది అని పవన్ తెలిపారు. కృష్ణ గారి ఆత్మ శాంతి కలగాలని మహేష్ గారికి నమ్రత గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పవన్ తెలపడం అభిమానుల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు