‘రిపబ్లిక్’ దర్శకుడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిపడిందా?

Published on Oct 6, 2021 11:19 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్‌’ మూవీ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అర డజన్‌కి పైగా సినిమాలను పవన్ లైన్‌లో పెట్టాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్న పవన్, వీటి తర్వాత హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాల్లో నటించాల్సి ఉంది. వీటి తర్వాత బండ్ల గణేష్-భగవాన్-పుల్లారావు నిర్మాణంలో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

ఇవన్ని పక్కన పెడితే కొత్తగా ‘రిపబ్లిక్’ సినిమా దర్శకుడు దేవ కట్టాతో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. మెగా హీరో సాయితేజ్ హీరోగా దేవ కట్టా రూపొందించిన ‘రిపబ్లిక్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పవర్ ఫుల్ డైలాగులు, నేటి రాజకీయ వాస్తవ పరిస్థితులకు సంబంధించి దేవ కట్టా ఇచ్చిన మెసేజ్ పవన్ కళ్యాణ్‌కి నచ్చిందని దీంతో తన కోసం ఓ మంచి కథను రెడీ చేయమని పవన్ దేవ కట్టాకు చెప్పాడని టాక్. అయితే ప్రస్తుతం దేవ కట్టా పవన్ కోసం ఓ మంచి కథను సిద్దం చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. చూడాలి మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది, ఒకవేళ నిజమైతే పవన్ కోసం దేవ కట్టా ఎలాంటి కథని రెడీ చేస్తాడన్నది.

సంబంధిత సమాచారం :