పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రాజెక్ట్ లాంఛ్ అయ్యేది అప్పుడే!

Published on Feb 8, 2023 11:02 pm IST


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా మరియు పొలిటికల్ కెరీర్ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇది అంత తేలికైన పని కాదు. ఇటీవలే నటుడి యొక్క రెండు కొత్త సినిమాలు అధికారికంగా ప్రారంభించబడ్డాయి, అవి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న తమిళ చిత్రం వినోదయ సీతం అధికారిక రీమేక్‌లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించనున్నారనే పుకార్లు ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తారని సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గాడ్ ఆఫ్ టైమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :