పవన్ “వీరమల్లు” గ్లింప్స్ రిలీజ్ కి రెడీ?

పవన్ “వీరమల్లు” గ్లింప్స్ రిలీజ్ కి రెడీ?

Published on Dec 20, 2022 2:02 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ కావడం తో ఇండస్ట్రీ లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన గ్లింప్స్ ను డిసెంబర్ 31, 2022 న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున పవర్ స్టార్ ఖుషీ సినిమా రీ రిలీజ్ కానుంది. అయితే ఈ ఖుషీ చిత్రం తో పాటుగా మేకర్స్ గ్లింప్స్ ను విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన పై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం తో పాటుగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సురేందర్ రెడ్డి తో ఒక చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజిత్ తో మరొక చిత్రం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వరుస ప్రాజెక్ట్ లతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు