ఇంటెన్స్ షాట్ ను తదేకంగా చూస్తున్న పవన్…వైరల్ అవుతోన్న సెట్ లోని ఫోటో!

Published on Apr 25, 2022 7:34 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక పక్క రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తూనే, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు. భీమ్లా నాయక్ హిట్ తో ఉన్న పవన్, అదే స్పీడ్ ను కనబరుస్తున్నారు. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ లో ఉన్నారు పవన్. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ ను దర్శకుడు కృష్ జాగర్లమూడి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ షాక్ కి సంబంధించిన సన్నివేశాన్ని తదేకంగా పరిశీలిస్తున్నారు. ఈ ఫోటో లో DOP జ్ఞాన శేఖర్ మరియు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నారు. హరి హర వీర మల్లు పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :