పవన్ “హరిహర వీరమల్లు” పరిస్థితి ఏంటి?

Published on Jun 6, 2023 5:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరమ్ తో కలిసి నటిస్తున్న బ్రో చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే విధంగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ఓజీ లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలో పూర్తి కానుంది. మరొక ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించారు. అయితే వీటిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన చిత్రం హరిహర వీరమల్లు.

ఈ చిత్రం షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ చాలా కసరత్తులు చేశారు. వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు. అయినప్పటికి ఇంకా చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ అనంతరం, రాజకీయాల్లో బిజీ కానున్నారు. మరి హరిహర వీరమల్లు షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :