పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ “ఖుషీ” రీ రిలీజ్ కి రెడీ!

పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ “ఖుషీ” రీ రిలీజ్ కి రెడీ!

Published on Dec 19, 2022 4:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో యూత్ lo ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్, అదే జోరును ఇన్నేళ్ళు అయినా కొనసాగిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఖుషీ. ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ లను నెలకొల్పి రికార్డ్ సెట్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 31 వ తేదీన మళ్ళీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఓజీ లవ్ సగా లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా భూమికా చావ్లా నటించింది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్. జే సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ పై క్లారిటీ రావడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి రికార్డ్ లను సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు