‘అఖిల్’ కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ ఫిక్స్ ?

Published on Jul 12, 2022 3:00 am IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అయితే, అఖిల్ కొత్త సినిమా పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరలో ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హీరోతో ఓ రొమాంటిక్ లవ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. మరో ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే.. ఈ సినిమాకి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ ను వేణు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ తో గతంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు అఖిల్, పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ టైటిల్ తో సినిమా చేస్తే భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.

సంబంధిత సమాచారం :