‘జిల్లా’ డైరెక్టర్‌తో పవన్ సినిమా మొదలైంది.!
Published on Oct 11, 2016 10:12 am IST

pawan-new-movie
‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి పరాజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యంగా చేయకుండా తన కొత్త సినిమా ‘కాటమ రాయుడు’ను ఎప్పుడో అనౌన్స్ చేసినా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఆ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక కాటమరాయుడు ఇలా సెట్స్‌పై ఉండగానే పవన్ తన తదుపరి సినిమాను కూడా మొదలుపెట్టేశారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తోన్న పవన్ 23వ సినిమా పూజా కార్యక్రమాలతో ఈ ఉదయమే ప్రారంభమైంది.

దసరా పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు, టీమ్ అంతా పాల్గొనగా సినిమా లాంచ్ అయింది. తమిళంలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. విజయ్ హీరోగా నేసన్ తెరకెక్కించిన ‘జిల్లా’ తెలుగులోనూ డబ్ అయి మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook