తన తదుపరి చిత్రాల దర్శకులతో “భీమ్లా నాయక్”.. పిక్ వైరల్..!

Published on Feb 16, 2022 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రానా దగ్గుబాటితో కలిసి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేసిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే “భీమ్లా నాయక్” సెట్స్‌లో పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల దర్శకులతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

పవన్ కళ్యాణ్‌తో హైబడ్జెట్ మూవీ “హరి హర వీరమల్లు” చిత్రాన్ని రూపొందిస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరియు “భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని రూపొందిస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్‌లు పవన్‌తో కలిసి ఫోటో దిగారు. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో పవన్ అభిమానులు ఈ పిక్‌ని వైరల్ చేశారు.

సంబంధిత సమాచారం :