పవన్ ‘హరిహర వీరమల్లు’ నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ …?

పవన్ ‘హరిహర వీరమల్లు’ నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ …?

Published on Sep 21, 2022 3:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మాతగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పాత్ర చేస్తుండగా ఆయనకి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అర్జున్ రామ్ పాల్, నర్గిస్ ఫక్రి, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ తదితరులు కీలక రోల్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్, పోస్టర్లు ఆ అంచనాలు మరింతగా పెంచాయి అనే చెప్పాలి.

ఇప్పటికే ఈ మూవీ యొక్క షూట్ దాదాపుగా యాభై శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే, గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కొంత వాయిదా పడింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ దసరా పండుగ తరువాత అక్టోబర్ 16 నుండి పక్కాగా మొదలెట్టేలా యూనిట్ డేట్ ఫిక్స్ చేసిందట. ఇక ఆ షెడ్యూల్ కి సంబంధించి ఈలోపు మిగతా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసారని, అలానే ఇటీవల ప్రకటించినట్లుగానే 2023 మార్చి 30న హరిహర వీరమల్లు మూవీ థియేటర్స్ కి రిలీజ్ చేయడం కూడా ఫిక్స్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు