పవన్ కళ్యాణ్ లుక్ చూసి పండగ చేసుకుంటున్న అభిమానులు !

20th, December 2016 - 10:37:03 PM

pawan-kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అభిమానులకు కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల విషయంలో ఫాలో అయ్యే ప్రతి స్టైల్స్ ట్రెండైపోతుంటుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాలో ఆయన స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పొలాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాలూకు వర్కింగ్ స్టిల్స్ రెండు రోజులుగా రెగ్యులర్ గా బయటకొస్తున్నాయి. వాటిలో పవన్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అన్నీ పక్కా మాస్ లుక్స్ తో అదిరిపోయేలా ఉన్నాయి.

వాటిని చూసిన అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమాన హీరో స్టైల్ ను ఆకాశానికెత్తేస్తూ, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళ హీరో అజిత్ నటించిన ‘వీరమ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కళ్యాణ్ రాయలసీమకు చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అజిత్, కమల్ కామరాజ్, శివ బాలాజీ, చైతన్య కృష్ణలు పవన్ తమ్ముళ్లగా నటిస్తున్నారు. డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ 2017 లో విడుదలకానుంది.