“ఉస్తాద్ భగత్ సింగ్” లాంచ్ లో ల్యాండ్ అయ్యిన ఉస్తాద్.!

“ఉస్తాద్ భగత్ సింగ్” లాంచ్ లో ల్యాండ్ అయ్యిన ఉస్తాద్.!

Published on Dec 11, 2022 12:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయితే రెండు సినిమాలు ఈ రెండు వారాల్లో అనౌన్స్ అయ్యిపోయాయి. మరి ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా దర్శకుడు హరీష్ శంకర్ తో అనౌన్స్ చేసిన ఫ్రెష్ ప్రాజెక్ట్ “ఉస్తాద్ భగత్ సింగ్”. మరి ఈ ఉదయం సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ చేసిన ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా చిత్ర యూనిట్ అయితే ఈరోజే ఈ సినిమా లాంచ్ ని హైదరాబాద్ లో ఘనంగా చేశారు.

మరి ఈ లాంచ్ కార్యక్రమంలో అయితే లేటెస్ట్ గా ఉస్తాద్ పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయ్యిన విజువల్స్ బయటకొచ్చి వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఉన్న తన “హరిహర వీరమల్లు” లుక్ లోనే హాజరయ్యి అదరగొట్టారు. దీనితో ఈ లాంచ్ ఈవెంట్ పవన్ డాషింగ్ ఎంట్రీ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికిఆ అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు