ఇండియాలో ల్యాండ్ అయ్యిన పవన్.. నయా లుక్ వైరల్.!

Published on Jan 7, 2022 7:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్” అనే మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోగా ఈ సినిమా నుంచి స్వల్ప విరామం తీసుకొని పవన్ చిన్న వెకేషన్ కి ఈ క్రిస్మస్ పండుగ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు పవన్ ఈ వెకేషన్ ని కంప్లీట్ చేసి ఇండియా లో ల్యాండ్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

రీసెంట్ గా పవన్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యినటువంటి ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. మరి వాటిలో పవన్ లుక్ కూడా బాగుందని చెప్పాలి. ఈ మధ్య ఆఫ్ లైన్ లో కనిపించిన వాటి కన్నా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఈ లుక్ లో పవన్ ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఈ వెంటనే సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేక మళ్లీ గ్యాప్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :