వివాదంపై స్పందించిన పవన్, మహేష్ !

20th, January 2017 - 12:02:28 PM

mahesh-pawan
తమిళనాడులో నానాటికి ఉదృతమవుతున్న జల్లికట్టు వివాదంపై తమిళస్టార్ హీరోలంతా ఒక్కటిగా స్పందించగా తెలుగు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు కూడా సామాజిక భాద్యతగా ఆ వివాదంపై స్పందించి తమదైన అభిప్రాయం వెల్లడించారు. ముందుగా నిన్న సాయంత్రం స్పందించిన మహేష్ బాబు సంస్కృయి, సంప్రదాయాల కోసం తమిళులంతా ఐకమత్యంగా పోరాటం చాలా బాగుంది. వాళ్ళ గొంతులు ఖచ్చితంగా వినిపిస్తాయి. వారికి నా మద్దత్తు తెలుపుతున్నాను అన్నారు.

ఇక మరొక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సాదాసీదాగా స్పందించకుండా ఏకంగా సాంప్రదాయ లోతులను సైతం ప్రాస్తావించారు. దాంతో పాటే తెలుగు సాంప్రదాయమైన ‘కోడిపందెం’ ను గురించి కూడా స్పందిస్తూ వాటిని బ్యాన్ చేయడం ద్రవిడ సంస్కృతిని దెబ్బతీయడం లాంటిదే. నేను పొలాచ్చిలో షూటింగ్ చేసేప్పుడు సంప్రదాయాలను బ్యాన్ చేయడం పట్ల వారు పడ్డ బాధ చూశాను. నిజంగా ప్రభుత్వం జంతు సంరక్షణ గురించి బాధపడుతుంటే ముందుగా దేశంలోని గోమాంస ఎగుమతులు, కోళ్ల ఫారాల పరిశ్రమపై దృష్టి పెట్టాలి అంటూ సంప్రదాయాల పట్ల తన మద్దత్తు తెలిపారు.