తన జీతంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.!

Published on Mar 15, 2023 5:36 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు సినిమాలు చేస్తున్నారు. మరి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తాను 27 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తనతో వర్క్ చేసిన దర్శకులు చేయబోతున్న వారు కూడా పవన్ సినీ ప్రస్థానంపై తమ స్పందన అందించారు. మరి లైనప్ లో ఇప్పుడు పవన్ హీరోగా ఓ రీమేక్ సినిమా సహా మరిన్ని చిత్రాలు ఇప్పుడు లైన్ లో ఉంచగా ఇప్పుడు షూటింగ్ చేస్తున్న వినోదయ సీతం రీమేక్ కోసం తాను తీసుకుంటున్న జీతం.. తన పారితోషకం విషయంలో పలు కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

తాను ఈ సినిమాకి 22 రోజులు డేట్స్ ఇవ్వగా ఒకో రోజుకి 2 కోట్లకి పైగా తీసుకుంటున్నానని తన పొలిటికల్ మీట్ లో చెప్పారు. దీనితో 45 కోట్లు తాను తీసుకుంటున్నానని తాను తెలిపారు. దీనితో ఆ మధ్య ఈ సినిమా విషయంలో పవన్ పై వచ్చిన రెమ్యునరేషన్ వార్తలు నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు అయితే తన కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :