పవన్ కొత్త సినిమా స్క్రిప్టు రెడీ అవుతోంది !


ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రాన్ని తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. దాని పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ తరువాత ఆ చిత్రానికి సంబందించిన ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ని ఆర్ టి నేసన్ కలిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి వారిద్దరూ చర్చించారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి స్క్రిప్టు సిద్ధం కానున్నట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.