ఎటెటో వెళ్తున్న పవన్ లేవనెత్తిన సమస్య.!

Published on Sep 29, 2021 3:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియా సహా సినిమా ఇండస్ట్రీలో మరోసారి విస్తృతంగా వైరల్ అవుతున్న పేరు. గత రెండు మూడేళ్ళ కితం ఎలా అయితే ఒక రేంజ్ లో పవన్ పై వేడి రాజేసే అంశాలు కథనాలు చూసామో ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితినే నెలకొన్నట్టు అనిపిస్తుంది.

అయితే ఇటీవల పవన్ టాలీవుడ్ కి సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు ఆన్లైన్ అమ్మకం విషయంపై కాస్త గట్టిగానే గళం విప్పడంతో ఒక్కసారిగా హీట్ మొదలయ్యింది. దీనితో పలువురు యువ హీరోలు కూడా పవన్ తో ఏకీభవించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మరోమారు విన్నవించుకున్నారు.

అయితే ఇప్పుడు పవన్ లేవనెత్తిన ఈ అంశం అసలు ఇప్పుడు ఆ సమస్య మీదే జరగట్లేదు అని చెప్పాలి. కంప్లీట్ గా పవన్ పైనే వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. దీనితో టికెట్ రేట్స్ సమస్య కాస్తా పక్క దారి పట్టినట్టు అయ్యిపోయింది. మరి ఇక అసలు సమస్యకి పరిష్కారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :