బుల్లితెర మీద పవన్ కళ్యాణ్ కుమార్తె

Published on May 5, 2021 2:00 am IST

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమార్తె ఆధ్య బుల్లి తెర మీదకు ఎంట్రీ ఇస్తోంది. జీతెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తల్లి రేణు దేశాయ్ తో పాటుగా ఆద్య కూడ పాల్గొంది. ఈ రియాలిటీ షోకు రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మథర్స్ డే సందర్బంగా స్పెషల్ షో ఒకటి ప్లాన్ చేశారు జీతెలుగు బృందం. అందులో భాగంగానే ఆధ్యను షోకు తీసుకొచ్చారు.

మే 9న మథర్స్ డే సంధర్బంగా ఈ షోను సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రోమోను కూడ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పిల్లలు కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రోమోను చూసి పవన్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇకపోతే పవన్ వారసుడిగా అఖీరా నందన్ సినిమాల్లోకి రావాలనేది అభిమానుల కోరిక. అఖీరాకు సినిమాల్లో నటించడం ఇష్టమైతే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తప్పకుండా ప్రోత్సహిస్తానని రేణు దేశాయ్ ఇదివరకే చెప్పారు కూడ.

సంబంధిత సమాచారం :