పవన్ అవైటెడ్ “వీరమల్లు” చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Sep 2, 2021 1:49 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేపట్టిన లేటెస్ట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచింది. మరి ఈరోజు పవన్ బర్త్ డే కానుకగా ప్లాన్ చేసిన అప్డేట్స్ షెడ్యూల్ నుంచి మేకర్స్ ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు.

మరి గతంలో వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి ఫిక్స్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం పవన్ నుంచి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే భారీ హుంగులు సెట్టింగ్స్, గ్రాఫిక్స్ తో మెగా సూర్య ప్రొడక్షన్ హౌస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :