పవన్ బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ వాయిదా..?

పవన్ బ్లాక్ బస్టర్ రీ రిలీజ్ వాయిదా..?

Published on Dec 18, 2022 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ హిట్ చిత్రాల్లో దర్శకుడు ఎస్ జే సూర్య తో చేసిన లవ్ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే మళ్ళీ రీ మాస్టర్ చేసి గ్రాండ్ రీ రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 31 న రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపై మరో అప్డేట్ ఆసక్తిగా మారింది.

ఈ చిత్రం ఈ డేట్ నుంచి మరో డేట్ కి సినిమా మారినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఏమిటంటే ఈ చిత్రం జనవరి 31 నుంచి రిలీజ్ కాగా జనవరి 6 వరకు ప్రదర్శితం అవుతుందట ఇందులో మార్పు ఏది లేదట. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించగా ఆలీ, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు