“ఖుషి” లో ఆ సాంగ్ ఐడియా పవన్ దే.!

“ఖుషి” లో ఆ సాంగ్ ఐడియా పవన్ దే.!

Published on Nov 23, 2022 3:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యినటువంటి కొద్ది ఏళ్లలోనే యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. అలా ఒక్కో సినిమాతో యూత్ ని ఆకట్టుకుంటూ పాటల ద్వారా కూడా చాలా ప్రభావితం చేసేవాడు. మరి పవన్ నుంచి అయితే ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు కూడా అప్పట్లో ఉండేవి అలా స్టార్ట్ చేసిన ఓ ప్రయోగమే టాలీవుడ్ సినిమాలో కంప్లీట్ హిందీ సాంగ్ పెట్టడం.

అయితే పర ఇండస్ట్రీ హిట్ “ఖుషి” లో యే మేరా జహ సాంగ్ పెద్ద చార్ట్ బస్టర్ అయితే ఈ సాంగ్ ని మణిశర్మ కంపోజ్ చెయ్యగా ఇప్పటికీ ఇది ట్రెండ్ సెట్టింగ్ నెంబర్ గా నిలిచింది. మరి లేటెస్ట్ గా అయితే దీని వెనుక ఫ్యాక్ట్ ని మణిశర్మ పంచుకోవడం ఆసక్తిగా మారింది. అప్పట్లో తెలుగు సినిమాలో కంప్లీట్ హిందీ సాంగ్ పెట్టించాలి అనే ఐడియా పవన్ కళ్యాణ్ దే మణిశర్మ అయితే లేటెస్ట్ గా ఓ టాక్ షో లో రివీల్ చేశారు. అంతే కాకుండా పవన్ ఐడియానే ఇది కాగా ఈ పాట తాను అనుకున్నట్టే పెద్ద హిట్ కూడా అయ్యింది అని తాను తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు