వైరల్ క్లిక్ : ‘వారాహి’ పై గదాదండం తో పవన్.!

Published on Jan 25, 2023 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేయడంతో పాటుగా మరోపక్క తన పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలా ఇప్పుడు పవన్ సినిమాలకి స్వల్ప బ్రేక్ ఇచ్చి తాను రీసెంట్ గా తన టూర్ నిమిత్తం రెడీ చేసి రిజిస్టర్ చేయించుకున్న “వారాహి” వాహనంపై విజయవాడకు ఈరోజు వచ్చారు. మరి అక్కడ పవన్ ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో రాగా అక్కడ పవన్ నుంచి లేటెస్ట్ గా ఓ ఫోటో మంచి వైరల్ గా మారింది.

తన వారాహి పై అయ్యితే పవన్ గదాదండం పట్టుకొని కనిపిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఓంకారం కూడా కనిపించడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి ఈ పిక్ అయితే రేపింది. దీనితో మెగా ఫ్యాన్స్ ఈ సూపర్ క్లిక్ ని షేర్ చేసుకుంటున్నారు. మరి ఇది వరకు పవన్ నుంచి ఈ తరహా ఆఫ్ లైన్ ఫోటోలు కూడా ఉన్నాయి. వాటి లిస్ట్ లో ఇది చేరింది అని చెప్పొచ్చు. ఇక ఈ కార్యక్రమం తర్వాత పవన్ అయితే మరో సినిమా వినోదయ సీతం షూట్ లో పాల్గొననున్నట్టుగా టాక్.

సంబంధిత సమాచారం :