పవన్ మాస్ సాంగ్ నిధి అగర్వాల్ ఫేవరెట్ అట.!

Published on Dec 29, 2021 8:00 am IST

ప్రస్తుత టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఎవరన్నా ఉన్నారు అంటే అది నిధి అగర్వాల్ అనే చెప్పాలి. తన మొదటి సినిమా నుంచే మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ యువ హీరోయిన్ ఇప్పుడు అనేక భారీ సినిమాలతోనే బిజీగా ఉంది.

ఇక లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక చాట్ సెషన్ నిర్వహించగా అందులో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలా ప్రస్తుతం ఆమెకి మోస్ట్ ఫేవరేట్ సాంగ్ ఏది అని అడగ్గా ప్రస్తుతం మాస్ ఆడియెన్స్ లో మంచి చార్ట్ బస్టర్ అయ్యినటువంటి పవన్ కళ్యాణ్ మాస్ సాంగ్ “లా లా భీమ్లా” అని బదులు ఇచ్చింది.

పవన్ కెరీర్ లోనే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా వస్తున్న “భీమ్లా నాయక్” కి థమన్ ఇచ్చిన ప్రతీ సాంగ్ కూడా ఒక బ్లాస్ట్ లా పేలింది. మరి వాటిలో నిధి కి ఈ సాంగ్ నచ్చడం విశేషం. ఇక ఇదిలా ఉండగా పవన్ మరియు నిధి అగర్వాల్ లు “హరిహర వీరమల్లు” అనే భారీ పాన్ ఇండియా సినిమా కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :