పవన్ సినిమా రిలేటెడ్ పోస్ట్ కి రెస్పాన్స్ ఇలా ఉంటుందా.!

పవన్ సినిమా రిలేటెడ్ పోస్ట్ కి రెస్పాన్స్ ఇలా ఉంటుందా.!

Published on Dec 10, 2022 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, మరి ఈ చిత్రం షూటింగ్ లో పవన్ చురుగ్గా పాల్గొంటుండడగా ఈ సినిమా కోసం అయితే పవన్ గతంలో ఎప్పుడు ఏ సినిమాకి పెట్టని ఎఫర్ట్స్ ని అయితే పెడుతున్నాడు.

మరి ఈ చిత్రం కోసం ఎప్పుడో రెండు దశాబ్దాల కితం వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ ని పవన్ మళ్ళీ ప్రిపేర్ అవుతుండడం కేజ్రీగా మారింది. ఇక ఇదిలా ఉండగా పవన్ సోషల్ మీడియాలో అయితే ఎప్పుడు కూడా తన సినిమాలు సంబంధించి పోస్ట్ లు ఎప్పుడూ పెట్టింది లేదు కానీ నిన్న తాను ప్రిపేర్ అవుతున్న పోస్ట్ ని ట్విట్టర్ లో పెట్టగా ఆ పిక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ట్విట్టర్ లో పవన్ కి 100కే లైక్స్ ఉన్న పోస్ట్ లు అది కూడా పొలిటికల్ రిలేటెడ్ రెండే ఉండగా ఇప్పుడు ఈ పోస్ట్ అయితే అసలు 24 గంటలు గడవకుండానే లక్ష లైక్స్ ని క్రాస్ చేసేసి పవన్ సినిమా రిలేటెడ్ పోస్ట్ పెడితే ఎలా ఉంటుందో తన స్టార్ పవర్ ని చూపించింది. దీనితో ఈ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు