పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో తన కెరీర్ లోనే హై ఎండ్ ఎలిమెంట్స్ అండ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాలిడ్ ప్రాజెక్ట్ “ఓజి” కోసం తెలిసిందే దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాలా కాలం తర్వాత అయితే పవన్ రేంజ్ కి తగ్గ సినిమా పడితే ఎలా ఉంటుందో ఆ హైప్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తుంది.
దీనితో పవన్ కెరీర్ లో మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఇది నిలవగా ఈరోజు అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలూకా గ్లింప్స్ పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ఇప్పుడు చిత్ర యూనిట్ అయితే రిలీజ్ చేశారు. మరి ఎన్నో అంచనాలు హైప్ ఉన్న ఈ గ్లింప్స్ వాటికి తగ్గట్టుగానే ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ప్రతి విజువల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
మెయిన్ గా అయితే గ్యాంగ్ స్టర్ గా పవన్ ని ఇంత పవర్ ఫుల్ షేడ్ లో ఎవరూ ఊహించని ఉండకపోవచ్చు. మరి వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ లో నిజంగానే బ్లడ్ బాయిల్ ఎక్కించే లెవెల్లో ఉందని చెప్పాలి. ఇంకా థమన్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత హైలైట్ అని చెప్పొచ్చు.