లేటెస్ట్..పవర్ స్టార్ “ఓజి” కొత్త షెడ్యూల్ షురూ.!

Published on May 18, 2023 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్స్ లో తన మరో ఫ్యాన్ డైరెక్టర్ యంగ్ అండ్ టాలెంటెడ్ సుజీత్ చేస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి పవన్ నుంచి తన పొటెన్షియల్ కి తగ్గ సరైన సినిమా కోసం చూస్తున్న వారికి ఈ చిత్రం ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా అయితే తెరకెక్కుతుంది. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ అయితే రీసెంట్ గానే ముంబై, పూణే లలో జరుపుకోగా లేటెస్ట్ గా అయితే మేకర్స్ కొత్త షెడ్యూల్ పై సాలిడ్ అప్డేట్ అందించారు.

ఇక ఈ సినిమాలో రెండో షెడ్యూల్ ని అయితే ఈరోజు నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ షూట్ లో పవన్ కూడా పాల్గొననుండగా ఫ్యాన్స్ కి మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఎప్పటికప్పుడు మంచి ఎగ్జైటింగ్ అప్డేట్స్ అందిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :