నిలిచిపోయిన పవన్ సినిమాల రీ రిలీజ్.!

నిలిచిపోయిన పవన్ సినిమాల రీ రిలీజ్.!

Published on Feb 6, 2023 7:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరో పక్క తన పాలిటిక్స్ లో కూడా పవన్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటుగా రీసెంట్ గా ప్లానింగ్ కి వచ్చిన తన పాత సినిమాల రీ రిలీజ్ లు ఆసక్తిగా మారగా పవన్ నుంచి వచ్చిన రెండు సినిమాలు జల్సా మరియు ఖుషి చిత్రాలు భారీ వసూళ్లతో రికార్డు సెట్ చేసాయి.

కానీ మళ్ళీ స్వల్ప గ్యాప్ లోనే పవన్ మరో హిట్ సినిమాలు తొలిప్రేమ మరియు బద్రి సినిమాలు కూడా ప్లానింగ్ కి వహ్చాయి డేట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అయితే బద్రి సినిమా పలు డేట్స్ కి వాయిదా పడింది కానీ ఇపుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ లు ఆపేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ రెండు సినిమాల రీ రిలీజ్ లు కూడా ఇప్పుడు లేవని చెప్పాలి. మరి వీటికి కారణాలు ఏంటి అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు